‘థాంక్యూ’ షెడ్యూల్ పూర్తి.. సెల్ఫీ షేర్ చేసిన రాశీ ఖన్నా-చైతూ

యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య – రాశీ ఖన్నా హీరోహీరోయిన్లగా నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా చిత్ర యూనిట్ కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాగ చైతన్య కలిసి దిగిన ఓ సెల్ఫీని రాశిఖన్నా అభిమానులతో పంచుకుంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్ నిలిపేస్తున్న సమయంలో ‘థాంక్యూ’ చిత్ర బృందం చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్ళింది. కోవిడ్‌ కారణంగా షూటింగ్‌ క్యాన్సిల్‌ అయిందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ తాజాగా షేర్‌ చేసిన ఫోటోతో ఆ వార్తలన్నీ పుకార్లేనని క్లారిటీ వచ్చింది. ‘థాంక్యూ’ ఇటలీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ బాణీలు అందిస్తున్నాడు.

నాగ చైతన్య లవ్ స్టోరి మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈసినిమా వాయిదా పడుతూ వస్తుంది. పరిస్థితులు సద్దుమణిగాక సినిమా విడుదల చేసే అవకాశలు ఉన్నట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్య సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.