కేరళలో ప్రారంభమైన పూర్తిస్థాయి లాక్‌డౌన్‌..

తిరువనంతపురం: కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి నేటి నుంచి తొమ్మిది రోజులపాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించింది. దీంతో శనివారం ఉదయం నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఈనెల 16 వరకు అమల్లో ఉంటుందని సీఎం పినరయి విజయన్ ప్రకటించింది.

కాగా, లాక్‌డౌన్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర విధులకు హాజరయ్యేవారికి మినహాంపు నిచ్చారు. అదేవిధంగా రేషన్ షాపులు, మెడికల్ దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు తెరిచే ఉండనున్నాయి. బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పనిచేయనున్నాయి. ప్రజా రవాణాను పూర్తిగా బంద్ చేశారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 38460 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.