కర్ణాటకలో సంపూర్ణ లాక్‌డౌన్.. రెండు వారాలు అన్నీ బంద్..

రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ విధించడం వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోవడంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ వరకు కర్ణాటక సర్కార్ పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తోంది. కర్ణాటకలో ప్రతీ రోజూ 45 వేలకు పైగా కేసులు, 350కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో యడ్యూరప్ప సర్కార్ రెండు వారాల కిందట వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ విధించారు.

అయితే ఇవేమీ కరోనాను నిలువరించలేకపోయాయి. దీనితో అక్కడి ప్రభుత్వం ఆఖరి అస్త్రంగా సంపూర్ణ లాక్‌డౌన్‌కు సిద్దమైంది. రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇవ్వగా.. ఆ తర్వాత అన్నీ బంద్ కానున్నాయి. అత్యవసర సేవలకు మినహాయింపు ఉండగా.. వివాహాలకు 50 మంది మాత్రమే హాజరు కావాలని తెలిపారు. ప్రజా రవాణా అంతా బంద్. కేవలం రైళ్లు. విమానాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.