మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న ‘యాస్‌’ తుఫాన్

యాస్‌ తుఫాను తీరం దిశగా కదులుతున్నది. ఈ రోజు మధ్యాహ్నం బాలాసోర్‌కు దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. పారాదీప్ కు 90, బాలాసోర్ కు 140 కి.మీ దూరంలో అతితీవ్ర తుఫాన్ యాస్‌ కేంద్రీకృతమైనట్టు చెబుతున్నారు. ఒడిషా,బెంగాల్ రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ బులెటిన్ విడుదల చేసింది.

తుపాను భూమిని తాకుతున్న దృష్ట్యా.. ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి మధ్యస్థ స్థాయిలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఈ ప్రభావిత ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుపాను ప్రభావిత ప్రాంతాలైన భద్రక్, జగత్సింగ్పుర్, కటక్, బాలాసోర్, దేన్కనల్, జైపుర్, మయూర్భంజ్, కేంద్రపుర, కియోంజగఢ్ వంటి కొన్ని ప్రాంతాల్లో బుధవారం, గురువారం.. అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.