తెలంగాణలో లాక్‌డౌన్‌ మరో 10 రోజులు పొడిగింపు

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగించింది. అలాగే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఇచ్చింది ప్రభుత్వం. ముఖ్యంగా లాక్‌డౌన్‌ మూడో విడతపై గత నెల 30న మంత్రి మండలి సమావేశమైంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేందుకు గంటసేపు అనుమతించింది. గత నెల 31 నుంచి ఇది అమలవుతోంది. మూడో విడత లాక్‌డౌన్‌ గడువు ముగుస్తుండటంతో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి మరోసారి సమావేశమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలతో దుకాణాలు, వ్యాపార సముదాయాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడుస్తున్నాయి. వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలింపు ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సడలింపు వేళలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చింది. ఇక సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.