కరోనా నేపధ్యంలో ఎన్నికలను వాయిదా వేసిన న్యూజిలాండ్ ప్రధాని

కరోనా కరోనా రహిత దేశం అంటే న్యూజిలాండ్. అయితే దాదాపు 102 రోజుల తర్వాత ఆ దేశంలో మళ్లీ కరోనా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల జరగాల్సిన సాధారణ ఎన్నికలను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు. వాస్తవానికి సెప్టెంబర్ 19న ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆ ఎన్నికలను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కరోనా వల్ల ఆక్లాండ్ లో లాక్ డౌన్ విధిస్తున్నామని చెప్పారు.