తెలంగాణ ప్రభుత్వం తీరు దుర్మార్గం: అనిల్ కుమార్ యాదవ్

తెలంగాణ ప్రభుత్వం తీరు దుర్మార్గమని, శ్రీశైలం డ్యామ్‌ నిండకుండానే విద్యుత్‌ ఉత్పత్తి ఎలా చేస్తారని ప్రశ్నించారు మంత్రి అనిల్‌ కుమార్‌. విద్యుత్ ఉత్పత్తి కారణంగా కృష్ణా జలాలు వృధా అవుతాయన్న మంత్రి రాష్ట్రం బాగు కోసం ఎంతదూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. ఏపీకి కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని, మా కేటాయింపులకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని అన్నారు.

తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని, అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్ అని చెప్పారు. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్న అనిల్.. మాట్లాడటం చేతకాక కాదు సంయమనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం తీరుపై ప్రధాని మోడీ, జల్‌శక్తి మంత్రికి తక్షణమే లేఖ రాస్తామని చెప్పారు మంత్రి అనిల్.