స్పుత్నిక్ కు షాక్: క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్‌

భారత్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రెండు డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ఇప్పటికే అనుమతులు లభించాయి. వ్యాక్సిన్‌ను అనేక ప్రాంతాల్లో అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ సంస్థ రష్యానుంచి దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తున్నది. అయితే, రష్యాలో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసిన గమలేరియా సంస్థ సింగిల్ డోస్ లైట్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లైట్ వెర్షన్ డోసులను రష్యాలో ప్రజలకు అందిస్తున్నారు.

బూస్టర్ డోస్‌గా కొన్ని దేశాలు అనుమతులు ఇచ్చాయి. అయితే, ఇండియాలో మాత్రం లైట్ డోస్‌కు అనుమతులు లభించలేదు. లైట్ డోస్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం ధరఖాస్తు చేసుకోగా, నిపుణుల బృందం అనుమతులను నిరాకరించారు. ఇకపోతే, డీఆర్‌డీవో సంస్థ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ సంస్థ 2 డీజీ ఔషదాన్ని తయారు చేసింది. ఈ ఔషదం మెరుగైన ఫలితాలు ఇస్తుండటంతో వాణిజ్యపరంగా వస్తృతంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రకటించింది.