భార్యకు చరణ్‌ స్పెషల్‌ విషెస్‌.. నీకు ఏ బహుమతి సరిపోదు..

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల నేడు (జూలై 20) పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చెర్రీ తన అర్ధాంగికి సోషల్‌ మీడియా వేదికగా స్పెషల్‌గా విషెస్‌ చెప్పాడు. ‘అవసరంలో ఉన్న ప్రజలకు కానీ.. నీ కుటుంబానికి కానీ.. నీ బెస్ట్ ఉవ్వడంలో ఎప్పుడూ నువ్వు వెనకడుగు వెయ్యలేదు. నీకు థాంక్స్ చెప్పడానికి ఏ గిఫ్ట్ కూడా సరిపోదు.. హ్యాపీ బర్త్ డే’ అంటూ చరణ్ తన ప్రేమను ఇలా అద్భుతమైన పదాల్లో వ్యక్త పరుస్తూ… హార్ట్‌, కేక్‌ ఎమోజీలతో ట్వీట్‌ చేశాడు.. ఉపాసన పనులను గౌరవిస్తూనే.. తన బాధ్యతలను గుర్తుచేస్తూనే.. తన ప్రేమను వ్యక్తపరచిన ఈ శుభాకాంక్షలతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా అనిల్‌ కామినేని, శోభన కామినేనిల కూతురే ఉపాసన. 2012 సంవత్సరంలో జూన్‌ 14న మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ను పెళ్లాడి కొణిదెల ఇంట్లో కుడికాలు పెట్టింది. మరోవైపు అపోలో హెల్త్‌ కేర్‌ బాధ్యతలు చూసుకుంటూ సెలబ్రిటీల డైట్స్‌ గురించి కూడా ఇంటర్వ్యూలు చేసింది. ఆ మధ్య రైతుగా మారి ఎత్తి సేంద్రీయ వ్యవసాయం కూడా చేసి వార్తల్లో నిలిచింది.