‘రాధాకృష్ణ’ ఫస్ట్ సింగిల్ విడుదలచేయనున్న పూరి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మల నేపధ్య కథాoశం తో ఒక గొప్ప సందేశాత్మక ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘రాధాకృష్ణ’. ప్రముఖ దర్శకుడు ఢమరుకం ఫేమ్ శ్రీనివాసరెడ్డి సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల చిత్ర నిర్మాణ సారథి పుప్పాల కృష్ణ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘రాధాకృష్ణ’ ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. ‘రాధా కృష్ణ’ ఫస్ట్ సింగిల్ ను డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఆగస్ట్ 22న విడుదలచేయనున్నారు. డమరుకం ఫేమ్ శ్రీనివాసరెడ్డి గారి సమర్పణలో అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం రూపొందుతోంది.