పిల్లల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకా!

భారత్ లో పిల్లల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకాను తీసుకురాబోతోంది. 12 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్ల కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా వారిపై ట్రయల్స్ చేసేందుకు గానూ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో)కు దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే పెద్దలపై చేసిన ఫేజ్ 3 ట్రయల్స్ లో ఆ టీకా ప్రభావం 85 శాతంగా ఉన్నట్టు తేలింది.

ఈ నెల ప్రారంభంలో టీకా అత్యవసర వినియోగం కోసం సంస్థ కేంద్రానికి దరఖాస్తు చేయగా.. అదే రోజు అనుమతినిచ్చేసింది. దీంతో దేశ ప్రజలకు మరో టీకా అందుబాటులోకి వచ్చినట్టయింది. మరోవైపు మరో రెండు నెలల్లో పిల్లల టీకాను అందుబాటులోకి తీసుకొస్తామంటూ రెండు రోజుల క్రితమే భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా ప్రకటించిన సంగతి తెలిసిందే.