జనసేనాని తలపెట్టిన శ్రమదాన కార్యక్రమనికి జాతిపిత మరియు జగజ్జేత ల ఆశీస్సులు కోరిన జిల్లా లీగల్సెల్ జనరల్ సెక్రటరీ కళావతి

సత్యం, అహింస, సేవా తత్పరత నేర్పిన బాపు, దృఢ సంకల్పం, పట్టుదల, రైతు, సైనికుడు దేశానికి రెండు కళ్లనీ, ప్రపంచానికి భారతదేశ పోరాట పఠిమ రుచి తెలియజేసిన విజేత శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి. ఆ మహానుభావుల అడుగుజాడలలో భారతదేశాన్ని అవినీతి రహిత, సుభిక్ష, శాంతియుత సుసంపన్నం భారతంగా శ్రమైక జీవన విధానం తో అసమర్థ పాలననీ అంతమొందించే సంకల్పానికి శ్రీ పవన్ కళ్యాణ్ రహదారుల బాగుకోసం తలపెట్టిన శ్రమదానానికి వారి ఆశీస్సులను అర్ధిస్తూ జాతిపితకు, జాతి జగ్గజ్జేత శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా వారికి శతకోటి వందనాలు తెలిపిన జిల్లా లీగల్సెల్ జనరల్ సెక్రటరీ కరణం నూకరత్న కళావతి.