ఇదీ ఏపీలో ప‌రిస్థితి అంటూ ఫొటో పోస్ట్ చేసిన నాదెండ్ల మ‌నోహ‌ర్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా రోడ్ల దుస్థితిపై జ‌న‌సేన పార్టీ మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. రోడ్ల ప‌రిస్థితిపై ప్ర‌భుత్వానికి ఎన్నిసార్లు విన్న‌వించుకున్న‌ప్ప‌టికీ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని అక్టోబ‌రు 2న శ్ర‌మ‌దాన కార్య‌క్ర‌మం కూడా నిర్వ‌హించింది. తాజాగా ఆ పార్టీ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఓ ఫొటో పోస్ట్ చేసి రోడ్లు ఎంత‌గా పాడైపోయాయో వివ‌రించారు.

‘గుంటూరు నుంచి తెనాలి నియోజ‌క వ‌ర్గంలోని నందివెలుగుకు వెళ్లే రోడ్డు దుస్థితి ఇది.. నిద్ర లేవండి వైఎస్ జ‌గ‌న్ గారు’ అంటూ ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. రోడ్డు మొత్తం గుంత‌లమ‌యంగా ఉండ‌డంతో దానిపైనే వ‌ర్ష‌పునీరు నిలిచి ఉంది. అందులో నుంచే వాహ‌నదారులు అష్ట‌క‌ష్టాలు ప‌డుతూ వెళ్తున్నారు. అర‌కిలోమీట‌రు దూరం క‌ష్టాల ప్ర‌యాణం అంటూ ఓ దిన‌ప‌త్రికలో ఈ ఫొటోను ప్ర‌చురించారు.