పెళ్లి రోజు పోస్ట్ పెట్టిన సమంత.. అభిమానుల గుండెల‌ను పిండేస్తోన్న వ్యాఖ్య‌లు..

హీరోయిన్ స‌మంత సామాజిక మాధ్య‌మాల్లో ఏ పోస్ట్ చేసినా అమితాస‌క్తిని క‌లిగిస్తోంది. స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోయిన నేప‌థ్యంలో  ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో ఈ అంశంపైనే విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతుండ‌డమే ఇందుకు కార‌ణం. సామాజిక మాధ్య‌మాల్లో ఎన్నో వ‌దంతులు వ‌స్తోన్న నేప‌థ్యంలో స‌మంత అధికారికంగా ఏమైనా ప్ర‌క‌ట‌న చేస్తుందా? అన్న విష‌యంపై నెటిజ‌న్లు చాలా ఆస‌క్తిగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో స‌మంత ఈ రోజు చేసిన ఓ పోస్ట్ మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది. ‘పాత ప్రేమ పాటలు.. పర్వతాలు.. శిఖరంపై చ‌లికాలంలో విని గాలి శ‌బ్దం.. పోగొట్టుకున్న పాత సినిమాల‌ పాటలు దొరికినప్పుడు… మ‌న‌సులోని బాధను ప్రతి ధ్వనించే ప్రేమ పాటలు… పాత బంగ్లాలు… మెట్ల మార్గాలు… వీధుల్లోని గాలి శబ్దం’… అంటూ సమంత క‌వితాత్మ‌క ధోర‌ణిలో ఈ పోస్ట్ చేసింది.  

రేపు ఆమె ల‌క్మీ ఫ్యాషన్ షోలో పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఫ్యాష‌న్ దుస్తులు ధ‌రించి ఆమె ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలోను బాధ‌ప‌డుతున్న‌ట్లు ఆమె ముఖం ఉండ‌డం గ‌మ‌నార్హం. చైతూతో విడిపోయిన స‌మ‌యంలో ఆమె పాత ప్రేమ‌, పాత బంగ్లా అంటూ పోస్ట్ లో పేర్కొన‌డంతో నెటిజన్లు ‘బాధ‌ప‌డ‌కు స‌మంత’ అంటూ రిప్లై ఇస్తున్నారు.