సాహిత్యంలో నోబెల్ పురస్కారం.. ఎవరికంటే..?

గల్ఫ్ నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా ఈ ఏడాది నోబెల్ సాహిత్య అవార్డును గెలుచుకున్నారు. ఆయన రచనల్లో జ్ఞాపకాలు, పేర్లు, గుర్తులు నిత్యం మారుతూనే ఉంటాయని, ఆయన పుస్తకాల్లో అంతం లేని విజ్ఞానాన్వేషణ ఉంటుందని అకాడమీ పేర్కొంది. మూసధోరణికి గుడ్‌బై చెప్పిన గుర్నా.. తన రచనలతో ఈస్ట్ ఆఫ్రికా సాంస్కృతికి వైరుధ్యాలను అనర్గళంగా చెప్పినట్లు అకాడమీ అభిప్రాయపడింది.

1948లో జన్మించిన అబ్దుల్ రజాక్.. జంజీబర్ దీవుల్లో పెరిగారు. క్యాంట్‌బెరీలోని కెంట్ యూనివర్సిటీలో ఇంగ్లష్ అండ్ పొస్ట్ కొలోనియల్ లిటరేచర్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అబ్దుల్‌రజాక్ మొత్తం పది నవలలను, అనేక చిన్న కథలను రాశారు. 21 ఏళ్ల నుంచి ఆయన రైటింగ్ ప్రారంభించారు. ఆయన తొలి భాష స్వాహిలి కాగా.. తన సాహిత్య ప్రక్రియకు మాత్రం ఆయన ఇంగ్లీష్‌ను ఎంచుకున్నారు.