డ్రైవింగ్ లైసెన్సు చెల్లుబాటు గడువు పొడిగించిన కేంద్రం
కరోనా మహమ్మారి కారణంగా వాహనాలు డ్రైవింగ్ లైసెన్సుల సహా ఇతర పత్రాల చెల్లుబాటు గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 1, 2020 నాటికి గడువు తీరే ఫిట్నెస్, రహదారి అనుమతి ఇలా వాహన సంబంధిత అన్ని పత్రాలు ఇక డిసెంబర్ వరకు చెల్లుబాటు అవుతాయి.