Vizag: స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహారదీక్షకు 250 రోజులు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహారదీక్ష 250 రోజులు పూర్తయిన సందర్భంగా… నిరాహారదీక్ష చేపట్టిన దీక్షా శిబిరంలో జనసేన పార్టీ రాష్ట్ర పి.ఎ.సి సభ్యులు గాజువాక నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ కోన తాతారావు, రాష్ట్ర నాయకులు శ్రీ గడసాల అప్పారావు, జనసేన నాయకులు 64 వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి పాల్గొన్నారు. జనసేన పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుందని తెలియజేశారు.