Kakinada: ఆనారోగ్యంతో బాధ పడుతున్న జనసైనికుడికి ఆర్ధిక సాయం

తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండల పరిధిలోని గొర్రిపూడి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త శ్రీ రామకృష్ణ గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్రీ రామకృష్ణది పేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం కరప మండల జనసేవాదళ్ సభ్యులు తమవంతుగా 15 వేల రూపాయలు సమకూర్చారు. ఆ మొత్తాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ పంతం నానాజీ చేతుల మీదుగా బాధిత జనసైనికుడికి అందచేశారు. అదే గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి బాసటగా జనసైనికులు మరుగుదొడ్డి కట్టించి ఇచ్చేందుకు ఏర్పాటు చేయగా, దానికి శ్రీ నానాజీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గొర్రిపూడి జనసైనకులు, జనసేవాదళ్ సభ్యులు, కరప మండల జనసేన నాయకులు పాల్గొన్నారు.