Anantapuram: ప్రజా పోరాట పాదయాత్ర చేపట్టి నేటికి రెండు సంవత్సరాలు

అనంతపురంజిల్లా ప్రధాన సమస్యలపై చేపట్టిన పాదయాత్ర(OCT 27 2019) నేటితో రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రతి సమస్య అలాగే ఉంది, ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని జిల్లాలోని ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించాలని జనసేనపార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం లక్ష్మి నరసింహస్వామి సన్నిధి నుండి అనంతపురంలోని కలెక్టర్ ఆఫీస్(100 కిలోమీటర్లు) వరకు చేపట్టిన పాదయాత్ర నేటితో రెండు సంవత్సరాలు గడుస్తుంది. కానీ అనంతపురంజిల్లాలోని 14 నియోజకవర్గాల MLA లు, ఇద్దరు MP లు ఉన్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, జిల్లాలోని వలసలు, రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో ప్రభుత్వం యొక్క అసమర్థతను, HLC కెనాల్ ఆధునీకరణ విషయంలో, అమరావతి Express హైవే విషయంలో, సెంట్రల్ యూనివర్సటీ విషయంలో ప్రతీ ఒక్క విషయంలో ప్రభుత్వం యొక్క అసమర్థతను జనసేనపార్టీ ద్వారా ఎండగడుతూ, ప్రభుత్వం జిల్లా సమస్యలపై చొరవ చూపకపోతే జనసేనపార్టీ ద్వారా మరొక్కసారి ఉద్యమిస్తామని తెలియచేయడం జరిగింది.
ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఈ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని జనసేనపార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య తెలిపారు.