Zika Virus: యుపిలో 100ని దాటిన కేసులు

యుపిలో రోజురోజుకి  జికా వైరస్‌   కేసుల సంఖ్య పెరుగుతోంది.  కొత్తగా మరో 16 జికా వైరస్‌ సోకడంతో యుపిలో మొత్తం కేసుల సంఖ్య 100ని  దాటింది. కాన్పూర్‌లో అత్యధికంగా ఈ కేసులు నమోదవుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వైరస్‌ సోకిన వారిలో అరుదైన నరాల సంబంధిత రుగ్మతలతో పాటు తీవ్రమైన లక్షణాలు కనిపించే అవకాశాలున్నాయి. ఈడిస్‌ ఈజిప్ట్‌ అనే దోమ కుట్టడం వల్ల జికా వైరస్‌ సోకుతుంది. నిలిచిపోయిన నీటిలో పెరిగే ఈ దోమ వల్ల డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి రోగాలు కూడా వస్తాయి. కాగా, జికా కేసులు అధికంగా వెలుగుచూసిన ప్రాంతాల్లో సామూహిక పరీక్షలు నిర్వహిస్తామని కాన్పూర్‌ యంత్రాంగం పేర్కొంది. జికా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య బఅందాలను ఏర్పాటు చేసినట్లు కాన్పూర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. నేపాల్‌ సింగ్‌ తెలిపారు.