ఎకరాకు 25 వేలు పరిహారం చెల్లించాలి గిద్దలూరు జనసేన డిమాండ్

గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం చెరువు కింద సాగు చేసిన వరి రైతులు ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయారని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెరువు కింద నీళ్లు లేక గత ఎనిమిది సంవత్సరాలుగా వరి వేయలేదు. ఈ సంవత్సరం పంట వేయగా ఈ దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. పలు గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న వరి పంటను ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శులు కాల్వ బాల రంగయ్య, గజ్జలకొండ నారాయణ, కంభం మండల జనసేన నాయకులు తడిసెట్టి ప్రసాద్, మద్దు బ్రమ్మయ్య, బేస్తవారిపేట మండల నాయకులు దుమ్మని చెన్నయ్య, లక్కంనేని వెంకటనారాయణ, దొర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.