నేడు ఖైరతాబాద్‌ ధన్వంతరీ నారాయణ మహాగణపతి నిమజ్జనం

ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఇవాళ జరుగనుంది. ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న స్వామి వారు నిజ్జనానికి తరలనున్నారు. శోభాయాత్ర ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3గంటలకు పూర్తి కానుందని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని పిలుపు నిచ్చారు.