జనసేన పార్టి బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చిన ఆకుల సుమన్

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ అన్నారు, ఆదివారం జిల్లా కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. నిత్యావసర సరుకులు పెంపుదల, పెట్రోల్, డీజిల్, కరెంట్ పెంపుదలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసేందుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై బలంగా పోరాడాలని సూచించారు, ఈ సందర్బంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న 46వ డివిజన్ లో నెలకొన్న అతిపెద్ద సమస్య డంపింగ్ యార్డ్ దీని వల్ల కొన్ని వందల కుటుంబాలు తీవ్ర ఇబ్బంది ఎదురుకుంటున్నారు డంపింగ్ యార్డ్ తరలించే విదంగా జనసేన పార్టీ పక్క ప్రణాళికతో పోరాటం మొదలుపెడ్తుంది అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా, మండల మరియు గ్రామాల కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలియజేసారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ కమిటీ సభ్యులు, ఉమ్మడి వరంగల్ యువజన విభాగం సభ్యులు మరియు విద్యార్థి విభాగం సభ్యులు పాల్గొన్నారు.