వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ముందుకు రావాలి: తీగల చంద్రశేఖర్

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలంతా వైజాగ్ స్టిల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడాలని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” డిజిటల్ క్యాంపెయింగ్ లో భాగంగా శనివారం గూడూరు జనసేనపార్టీ కార్యాలయంలో #Raise_Placards_ANDHRA_MP అనే నినాదంతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటికరణ ఉద్యమంలో పార్టీలకతీతంగా పోరాడాలని పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ, టీడీపీ MPలు, రాజ్యసభ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల నేతలతో కలిసి కేంద్రం పై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రం ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ మీద తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు స్వరూప్, మోహన్, రాజశేఖర్, ఇంద్రవర్ధన్, శివ, సాయి వసంత్, హరి, శివమణి, కోటి తదితరులు పాల్గొన్నారు.