స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పార్లమెంటులో మీ గళం వినిపించండి: త్యాడ రామకృష్ణారావు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంట్ లో ఎంపీలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్లకార్డులు ప్రదర్శించేందుకు,వారిపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా కార్యకర్తలకు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ ఈనెల 18,1920 తేదీల్లో నిర్వహించమని పిలుపునిచ్చిన సంగతి విధితమే.. ఇందులో భాగంగా చివరిరోజైన సోమవారం ఉదయం చీపురుపల్లి లో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణను ఆపాలని, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గళమెత్తాలని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ముందుగా చీపురుపల్లి గ్రామసచివాలయం ఎదుట జనసేన నాయకులు కొంతసేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను ఆపాలని శాంతియుతంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఎం.పీ. బెల్లానకు సచివాలయంలో వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పరిశ్రమలను అమ్మే క్రమంలో మన రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రయివేటుపరం చేసే ప్రక్రియ మొదలైందని.. దీన్ని పార్లమెంటులో ఆపే బాధ్యత పార్లమెంట్ సభ్యులుగా మీకు ఎంతైనా ఉందని,ఎంతోమంది ఉద్యమాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి సాధించిన విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్ముతుంటే బాధ్యతగల వ్యక్తులుగా మీరు పార్లమెంటులో ఎలాంటి నిరసన తెలపకపోవడం విచారకరమని,విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రాణ త్యాగాలు చేసైనా ఆపుతామన్న వైస్సార్సీపీ నాయకులు, కనీసం పార్లమెంటులో గళం విప్పకపోవడం శోచనీయమని అన్నారు. ఇకనైనా విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడే ప్రధమ బాధ్యత పార్లమెంట్ సభ్యులుగా మీపై ఉందని గమనించి పార్లమెంట్ లో కనీసం ప్లకార్డ్స్ అయినా పట్టుకుని మీ నిరసన దేశానికి తెలిసేలా చేయాలని కోరామని తెలిపారు. ఈ విషయమై ఎం.పీ. బెల్లాన చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించారని, స్టీల్ ప్లాంట్ అందరికీ ఉపయోగకరమైన పరిశ్రమ అని, అందుకే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన సమావేశంలో తమగళం వినిపించానని, తప్పకుండా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు,దళిత సత్తా రాష్ట్ర ఉపాధ్యక్షులు, రేగిడి లక్ష్మణరావు,నాయకులు ఎర్నాగుల చక్రవర్తి, లోపింటి కళ్యాణ్, దాసరి యోగేష్, లావుడి నిరంజన్ పాల్గొన్నారు.