బండారు శ్రీనివాస్ సమక్షంలో ఆలమూరులో జనసేనలో చేరికలు

ప్రజల్లో మార్పు మొదలైంది! ప్రముఖ జనసేననేత ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో అంచనాలకు మించి, జనసేన పార్టీ వైపు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ! జనసేనాని గెలుపు నల్లేరు మీద నడకే ఆఒటున్న పలువురు బీసీ, దళిత సోదరులు, యువకులు.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలంలోని, ఆలమూరు గ్రామం నుంచి, గ్రామ శివారు జిల్లెల్ల పేట నుంచి పలువురు బీసీలు, దళిత యువకులు జనసేన పార్టీలోకి ఈరోజు కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జి బండారు శ్రీనివాస్ సమక్షంలో వారి స్వగృహంనందు లాంఛనంగా చేరారు. జనసేన పార్టీ కండువాను ఈ యువ నాయకుల భుజస్కంధాలపై జనసేన నేత బండారు శ్రీనివాస్ వేసి, ఎంతో ప్రేమతో ఆత్మీయతతో వారికి జనసేన పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికి, ఆలమూరు గ్రామ జనసేన పార్టీ బాధ్యతలను జనసైనికులు, గ్రామ జనసేన అధ్యక్షులు శెట్టిబలిజ నాయకులు కట్టా రాజుతో పాటు, ఆలమూరు గ్రామ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా దళిత నాయకులు పెట్టా రంగనాథ్ నియమించారు. వీరితో పాటు ఆలమూరు గ్రామం నుంచి, కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసు సమక్షంలో పలువురు ఎస్ సి, బి సి నాయకులు దాసి మోహన్, నల్ల శ్రీనివాస్, ముసలి భాస్కర్ రావు, లఒకే దనకృష్ణ, కొప్పాడి జైరాజ్, వీరంతా ఆలమూరు గ్రామం ప్రముఖ సీనియర్ జనసేన నాయకులు తాళ్ల డేవిడ్ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి వారి నాయకత్వంలో బండారు శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్చార్జి సమక్షంలో మంగళవారం జనసేన పార్టీలోకి చేరారు. వీరి రాకతో ఆలమూరు మండల కేంద్రమైన, ఆలమూరు గ్రామంలో జనసేన పార్టీ మరింత బలోపేతం అయినదని, భవిష్యత్తులో జనసేనాని నాయకత్వంనకు తిరుగులేదని, జనసేనాని ఆశయాలు నచ్చి మెచ్చి, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, జనసేన పార్టీలోకి దళితులు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాల వారు జనసేనానిని ఎంతో ఆదరిస్తున్నారని అనడానికి నిదర్శనం ఇలాంటి భారీ చేరికలే కారణమని, పలువురు జనసైనికులు, ప్రజలు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.