థామస్ కప్ విజేత సాత్విక్ సాయిరాజ్ ను అభినందించిన జనసేన నాయకులు

అమలాపురం: 73 ఏళ్ల థామస్ కప్ బ్యాడ్మింటన్ చరిత్రలో తొలిసారి భారత్ కు విజయాన్ని సాధించిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ నీ ఆఫీసర్స్ క్లబ్ లో జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు లింగోలు పండు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస, అమలాపురం మునిసిపల్ కౌన్సిలర్స్ ఏడిద శ్రీను, పడాల నానాజీ, గొలకొటి విజయలక్ష్మి, ఏ.వేమవరప్పాడు ఉప సర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరావు, కొంకాపల్లి వార్డు సభ్యురాలు తిక్కా సరస్వతి, చాట్ల మంగతాయారు, నాయకులు నల్లా వెంకటేశ్వరావు, డి.ఎస్.ఎన్ కుమార్, కొలిశెట్టి తాతాజీ, సాధనాల మురళి, నిమ్మకాయల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.