పెట్టుబడులకు భారత్ ముందంజ: ప్రధాని మోదీ

ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన దేశాల్లో భారత్‌ ముందుoదని ప్రధాని మోదీ చెప్పారు. గురువారం జరిగిన ‘అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక’ కార్యక్రమంలో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతున్నదని, విధాన పరమైన నిర్ణయాలు, సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. దీంతో ప్రపంచ పెట్టుబడులకు భారత్‌ స్వర్గధామంగా మారిందని పేర్కొన్నారు. సులభతర వాణిజ్యం కోసం సంస్కరణలు తీసుకొచ్చామని, పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరచామని వెల్లడించారు. కరోనా కారణంగా పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు అందజేస్తున్నామని ప్రధాని మోదీ వివరించారు.