SBI ఖాతాదారుల కోసం ఎస్‌బీఐ కొత్త ఫీచర్‌

అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ తమ ఖాతాదారుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఏటీఎం కార్డులతో మోసాలు జరుగుతుంటాయి. ఈ మోసాలను అరికట్టేందుకు ఎస్‌బీఐ ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా ఏటీఎం కార్డుతో బ్యాలెన్స్ చెక్ చేసినా, లేక మిని స్టేట్‌మెంట్ చెక్ చేసినా ఆ బ్యాంకు ఖాతాతో రిజిస్టర్ అయిన మొబైల్‌ నెంబర్‌కు మెస్సేజ్

ఒకవేళ మీరు ఎక్కడో ఉన్నా.. ఏం ట్రాన్సాక్షన్ చేయకున్నా.. మీకు ఈ మెస్సేజ్ అలర్ట్ వచ్చిందంటే వెంటనే మీ డెబిట్ కార్డును బ్లాక్ చేసుకోవాలి. ఏటీఎం కార్డుల మోసాలను కొంతలో కొంతైనా తగ్గించేందుకు ఈ ఫీచర్ అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.

ఇకనుంచి మీకు స్టేట్ బ్యాంకు ఖాతాలకు సంబంధించి మెస్సేజ్ అలర్ట్స్ వస్తే లైట్ తీసుకోకుండా అలర్ట్ అవ్వాలని.. వెంటనే మీ ఏటీఎం ఖాతాను బ్లాక్ చేయాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ మధ్య కార్డ్‌లెస్ క్యాచ్ విత్‌డ్రా సౌకర్యాన్ని సైతం బ్యాంకు తమ ఖాతాదారులకు కల్పించింది.