జగనన్న విద్యా కానుకకు నెలరోజుల వాయిదా

అన్ లాక్ 4.0 మార్గదర్శకాల్లో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు పాఠశాలల తెరవబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ  మేరకు రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. 5వ తేదీ నుంచి పాఠశాలలు పున: ప్రారంభిస్తామని ఏపీ సర్కార్ నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్‌ 5న ఇవ్వదలచుకున్న జగనన్న విద్యాకానుక అక్టోబర్‌ అయిదో తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేయాలని ఆయన ఆదేశాలు జారీచేశారు.