మామిడికుదురు జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా జాలెం శ్రీనివాస రాజా

జనసేన పార్టీ మామిడికుదురు మండల శాఖ అధ్యక్షుడిగా జాలెం శ్రీనివాస రాజా నియమితులయ్యారు. నగరం గ్రామానికి చెందిన శ్రీనివాస రాజా జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో పనిచేస్తూ అధినేత సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేవారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించి జన సైనికుల్లో ఉత్తేజాన్ని నింపి పార్టీ అభివృద్ధి సేవలందించారు. ఒక వైపు యువ న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూనే మరోవైపు జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల మన్నలను పొందారు. శ్రీనివాస రాజా కొంతకాలం జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రెటరీగా సేవలందించారు. తనపై నమ్మకంతో పార్టీ మండల శాఖ అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధిష్టానానికి, జిల్లా కమిటీలకు, మండల నాయకులకు, జనసైనికులకు శ్రీనివాస రాజా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ మామిడికుదురు మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని జాలెం శ్రీనివాస రాజా తెలిపారు.