కావేటి మురళీ కృష్ణ కుటుంబానికి 5 లక్షల రూపాయల భీమా చెక్కును అందజేసిన జనసేన నాయకులు

ప్రమాదవశాత్తు మరణించిన రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ నియోజకవర్గం, శంషాబాద్ కు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త కావేటి మురళీ కృష్ణ కుటుంబానికి 5 లక్షల రూపాయల భీమా చెక్కును పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో అందజేశారు. జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ నాయకులు రాధారం రాజలింగం, దామోదర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ జనసైనికులు గోపాలకృష్ణ, సురేష్, వెంకటేష్, సూరి తదితరులు పాల్గొన్నారు.