రాజకీయ, ప్రజా సంఘ నాయకుల ముందస్తు అరెస్టును ఖండించిన పాడేరు జనసేన

పాడేరు ఐటీడీఏలో బుధవారం పాలకవర్గ సమావేశంలో రాజకీయ, ప్రజా సంఘాల, ఉద్యమకారుల గొంతు నొక్కే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటని జనసేన పార్టీ ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా, సన్యాసిరావు ప్రభుత్వంపై ధ్వజమెత్తరు. గురువారం జనసైనికులతో సమావేశమై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ప్రజా సమస్యల మీద నిత్యం పని చేస్తున్నటువంటి ప్రజా సంఘ ఉద్యమకారులను అరెస్టులు చేస్తూ నిర్బంధించడం సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, గిరిజన సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాని చేతకాని జగన్ ప్రభుత్వం రోజు రోజుకి ఉద్యమకారులను అరెస్టులతో గిరిజన ప్రజా సంఘాల పోరాటాలను అణిచి వేస్తుంది. ఇటువంటి అణిచివేసే ధోరణి ప్రభుత్వం విడనాడాలని, లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పే రోజులు కోసం వైయస్సార్ ప్రభుత్వం ఎదురుచూడక తప్పదని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వానికి సూచిస్తుంది. ప్రభుత్వ మా గిరిజన ప్రాంతంలో ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయక, చట్టాలను తూట్లు పొడుస్తుంటే చట్టాలను కాపాడుకునే లక్ష్యంతో ప్రభుత్వానికి నిరసనల ద్వారా శాంతియుతంగా పోరాడుతున్న ప్రజా సంఘ నాయకులను ఎక్కడ దొరికితే అక్కడ అన్నట్టుగా ముందస్తు అరెస్ట్ చేయడం పట్ల జనసేన పార్టీ విశాఖ మన్యం ప్రాంతం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని సాయిబాబా తెలిపారు. ఇప్పటికైనా గిరిజనుల చట్టాలను, హక్కులను కాపాడాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.