మండపేటలో 2022 క్యాలెండర్ ఆవిష్కరణ

తూర్పగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ అధ్యక్షతన 2022 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు, చెల్లూరు MPTC-1 శ్రీమతి గొల్లపల్లి అనురాధ వెంకటరమణ, వల్లూరి సత్య ప్రసాద్, తలాటం వెంకటేష్, మండపేట రూరల్ మండలం అధ్యక్షులు కుంచే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.