గాయపడిన బాలునికి ఆర్థిక సాయం అందించిన అవిడి జనసైనికులు

కొత్తపేట, ప్రమాదంలో గాయపడిన బాలుడికి ఆర్థిక సాయం అందించిన జనసైనికులు. కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఇచ్చిన పిలుపుకి స్పందించి అవిడి గ్రామ జనసైనికులు 15000 రూపాయలు, అవిడి ఐటీ విభాగానికి చెందిన వారు 35000 ఇవ్వగా మొత్తం 50000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని గాయాపడిన బాబు కుటుంబ సభ్యులకు శ్రీ బండారు శ్రీనివాస్ చేతులమీదుగా అందచేశారు.