మాడుగుల నియోజకవర్గంలో 4వ రోజు “పల్లె పల్లెకి జనసేన”

“పల్లె పల్లెకి జనసేన” కార్యక్రమంలో భాగంగా 4వ రోజు మాడుగుల నియోజకవర్గం, దేవరపల్లి మండలంలో వాకపల్లె, నాగయ్యపేట గ్రామాలలో జనసేన పార్టీ నాయకులు శ్రీ గుమ్మడి శ్రీరాం గారు పర్యటించారు. గ్రామంలోని ప్రజలందరికి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించడం జరిగింది. ప్రజలు గ్రామాలలో వున్న అనేక సమస్యలను గుమ్మడి శ్రీరాం దృష్టికి తీసుకొని వచ్చారు. జనసేన పార్టీ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని హామీ ఇచ్చారు. అలాగే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సమస్యను పరిస్కారం చేస్తామని స్పష్టం చేశారు. జనసేన పార్టీకి ఏ ఇతర ప్రాంతీయ పార్టీలతో ఎటువంటి పొత్తు లేదని స్పష్టం చేసారు. వైస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు చేస్తున్న డ్రామా రాజకీయాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. మూడవ ప్రత్యామ్నాయం రాకుండా చెయ్యడమే వాళ్ళ ప్రధాన అజెండా అని, అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో అధికార వైస్సార్సీపీ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం జనసేన పార్టీనే అని శ్రీరామ్ స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికలలో మాడుగుల నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్క జనసైనకుడు కష్టపడాలి అని జనసైనికులకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం దగ్గరికి ప్రజలు కాదు, ప్రజల దగ్గరికి ప్రభుత్వం అని స్పష్టం చేసారు. కార్యక్రమంలో భాగంగా నూతన సంవత్సర క్యాలెండర్స్ ని విడుదల చేసారు.