ప్రకాశం జిల్లా లింగసముద్రం మండల అధ్యక్షులుగా అంగులూరి నరసింహరావు

ప్రకాశం, జనసేన పార్టీని విలువలతో సైద్ధాంతిక బలంతో కూడిన రాజకీయ పార్టీగా అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ రూపుదిద్దారు. పార్టీ పట్ల ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకొనేందుకు అధ్యక్షులు వారి ఆశయాలు, ఆదేశాలకు అనుగుణంగా నిరంతరం కృషి చేయాలి. ఈ దిశగా ముందుకు వెళ్ళేందుకు ప్రకాశం జిల్లా లింగసముద్రం మండల అధ్యక్షులుగా శ్రీ అంగులూరి నరసింహరావు నియమిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయించడం జరిగింది. మండల అధ్యక్షులు నియామక పత్రాన్ని ప్రకశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ శనివారం అందజేయడం జరిగింది.