MBA చదువుకున్న SC దళిత పేదవాడికి జనసేన పార్టీ “పొన్నలూరు మండల అధ్యక్ష పదవి”

జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న కొన్ని జిల్లాలకు మండల కమిటీలు వేయడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మండల కమిటీలు వేయడం జరిగింది. కొండేపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం అధ్యక్షులుగా కనపర్తి మనోజ్ కుమార్ ఎన్నిక కాబడి శ్రీ షేక్ రియాజ్ చేతుల మీదగా నియామక పత్రం మరియు షీల్డ్ ను అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీలో SC,ST,BC గలవారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మరీ ముఖ్యంగా సగటు సామాన్య మానవుడు కూడా రాజకీయం చేయవచ్చు, జీరో బడ్జెట్ రాజకీయం చేసి చూపించవచ్చు, అందుకు ఉదాహరణగా ఇటీవల కాలంలో జనసేన పార్టీ నుండి చదలవాడ ఎంపీటీసీ “శివకృష్ణ” గెలుపే సాక్ష్యం. సామాన్య మానవుడికి న్యాయం జరగాలంటే జనసేన పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, పేదవాడికి అండగా ఉండటానికి పెట్టిన పార్టీ “జనసేన పార్టీ” అని తెలిపారు. నేను తీసుకుంది పదవి కాదు, బాధ్యత విలువలతో కూడిన బాధ్యత, నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటూ, పొన్నలూరు మండలంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడ నేను ఉంటాను, ప్రభుత్వం నుండి ప్రజలకు రావలసిన ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు వారికి అందే విధంగా నేను చేసి చూపిస్తాను, YSRCP ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగడతాను, ప్రభుత్వంతో పోరాడి ప్రజలకు అండగా నిలుస్తాను, వార్డు, గ్రామ స్థాయి నుండి పార్టీని స్థానికంగా బలోపేతం చేస్తాను, ప్రజలకు అండగా ఉంటూ నిత్యం అందుబాటులో ఉంటాను, ప్రజాసమస్యల పరిష్కారంలో నేను ప్రజలకు అండగా ఉంటాను, నా అంతిమలక్ష్యం 2024లో శ్రీ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలి. నాయకులు వస్తూఉంటారు పోతూఉంటారు ఒక బాధ్యత విలువలతో కూడిన నాయకుడు ఏకైక నాయకుడు ఒక శ్రీ పవన్ కళ్యాణ్ మాత్రమే. నాకు పొన్నలూరు మండల అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ కి మరియు షేక్ రియాజ్ కి ధన్యవాదాలు అని మనోజ్ కుమార్ తెలిపారు.