బాలాజీ జిల్లాను వ్యతిరేకిస్తున్న స్థానికులు – ఏకీభవిస్తున్న జనసేన

తిరుపతి అనే పేరు ఒక చరిత్ర తిరుపతి తిరుమల అనే కవలలు లాంటి కమలమైన పేరును, బాలాజీ జిల్లాగా మార్చడం చాలా బాధాకరం, నార్త్ సైడ్ వారు బాలాజీ అంటారు మన పక్క అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అని అంటారు అందరికీ అది మాత్రమే తెలుసు, అయితే దీని వెనుక ఏదైనా మీ యొక్క స్వలాభం కోసం పేరు మారుస్తున్నారా అని స్థానికుల ఆవేదన. దీనిపై జనసేన పార్టీ కూడా తిరుపతి జిల్లా గానే ఉంచాలి, మార్చి తిరుపతి యొక్క చరిత్రను చెరపవద్దని అధికార యంత్రాంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఒక ప్రకటనలో తెలిపారు.