మెగాస్టార్‌ గుండు బాస్‌గా అసలు సీక్రెట్..!

మెగాస్టార్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్న చిరంజీవి.. తాజాగా గుండుతో ఉన్న ఫోటోను షేర్ చేసారు. ఈ వయస్సులో కూడా చిరు ఇంత యంగ్ గా కనిపిస్తుండడంతో అందరూ వావ్ అని అంటున్నారు. ఆచార్య సినిమా కోసం చాలా స్లిమ్‌గా మారిపోయిన చిరు తాజాగా తన ఇన్‌స్టా గ్రామ్‌లో గుండుతో ఉన్న ఓ ఫొటో పెట్టి  నేను సన్యాసిలా ఆలోచించగలనా? అని ఆ ఫొటోకు #UrbanMonk అనే క్యాప్షన్ కూడా జోడించారు.

ఇప్పుడు ఈ లుక్ చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. అయితే ఇది మేకప్ అన్న చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ కొత్త లుక్ చిరు నటిస్తోన్న ఆచార్య సినిమాలో కొన్ని సీన్స్ లో కనిపిస్తుందని.. అందుకే చిరు అందుకు అనుగుణంగా గుండుతో కనిపిస్తున్నారని తెలుస్తోంది. ఇక చిరు సన్నిహితులు అయితే భవిష్యత్తులో ఆయన చేయబోయే ఓ సినిమాకు సంబంధించిన లుక్ అంటూ క్లారిటీ ఇచ్చారు.