మంగళపురం మరియు నైనవరం గ్రామంలో గ్రామకమిటీల నిర్మాణం పై చర్చ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-31-at-9.21.50-AM-1024x844.jpeg)
గన్నవరం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రామకృష్ణ సూచన మేరకు గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని పాతపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళపురం మరియు నైనవరం గ్రామంలో పర్యటించి మండల కమిటీ గ్రామ కమిటీల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బండ్రెడ్డి రవి, నున్న గ్రామ నాయకులు లంకే సురేష్, ముహమ్మద్ సంథాని మరియు మంగళపురం నైనవరం గ్రామ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-31-at-9.21.49-AM-1024x768.jpeg)