జనసేనాని ఆశయాలతో ముందుకు సాగుతాం, ఎక్కడా రాజీపడం..!

*జనసేన మండల అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపము నందు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులతో ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు జనసేన పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, మరియు రావులపాలెం జనసేన పార్టీ అధ్యక్షులు తోట స్వామి మాట్లాడుతూ… రావులపాలెం బ్రిడ్జి గోదావరి నదిలో మట్టి మాఫియా అక్రమార్కులు నదిలో సుమారు 20 అడుగుల లోతు వరకు మట్టిని యథేచ్ఛగా గత కొన్ని నెలలుగా అమ్ముకుంటున్నారని, అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారని, పర్యావరణానికి హాని జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు, రావులపాలెం స్థానిక ఎమ్మార్వోకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేని కారణంగా, రావులపాలెం బ్రిడ్జి సమీపంలోని గోదావరి లంక నదీ పరివాహక ప్రాంతంలో మట్టి మాఫియా, అధికార పార్టీ అండదండలతో, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వారి సహకారంతో అక్రమ మట్టి, బొఒడు ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని, దీనిపై రావులపాలెంలో రెండు రోజులు క్రితం రావులపాలెం ఎమ్మార్వో కార్యాలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగిందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంనకు అనూహ్యమైన స్పందన, భారీ స్థాయిలో వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వం ఎంత పటిష్టంగా ఉన్నదో, అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి గుండెల్లో రైళ్ళు పరిగెట్టినాయన్నారు. మా అధినాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్, అడుగుజాడల్లో మేమంతా కలిసి, నిజాయితీపరుడైన మా నాయకుడు బండారు శ్రీనివాస్ నాయకత్వంలో, నీతివంతమైన రాజకీయాలతో ప్రయాణం చేస్తున్నామని, ఎవరితో లాలూచీ పడవలసిన అవసరం లేదని, కొందరు స్వార్ధపరులు తప్పుడు సంకేతాలతో జనసేన పార్టీ వేరు, బండారు శ్రీనివాస్ వేరు అని, కుట్రపూరితంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకు వెళ్లడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిజాయితీపరుడైన మా నాయకుడు బండారు శ్రీనివాస్ వెంట, కొత్తపేట నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు ఆకర్షితులవట్టం దీనికి నిదర్శనంఅని, ఈ మధ్య కాలంలో భారీగా జనసేనపార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయని, ఈ భారీ చేరికలను చూసి తట్టుకోలేని, కొందరు స్వార్ధపరులు లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలియజేశారు. కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి మంచి ఆదరణతో అంచెలంచెలుగా నమ్మకం ప్రజల్లో పెరిగిందని, భారీ అంచనాలతో ప్రజల హృదయాలలో ఒక నమ్మకమైన నేతగా బండారు శ్రీనివాస్ నిలిచారని, ఈ మధ్యకాలంలో అనేక ప్రజా సమస్యలు కొరకు పోరాటాలు చేశారని, ఇంకా చేస్తూనే ఉన్నారని, కొత్తపేట ప్రధాన రహదారి సమస్య పైన, కొత్తపేట మండలంలోని వానపల్లి గ్రామం వద్ద నారాయణ లంక భూములలో అక్రమ మట్టి తవ్వకాలు పైన, రావులపాలెం-కొత్తపేట ప్రధాన రహదారి రోడ్లు యొక్క దుస్థితి, పరిస్థితిపైన, ప్రధానరోడ్లు అధ్వాన్నంగా ఉండటం మూలంగా డిజిటల్ ఉద్యమం పైన, పంటలు దెబ్బతిన్న రైతులకు సంఘీభావం, మరియు అమరావతి ఏకైక రాజధాని కొరకు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కొరకు, గత మూడు నెలల క్రితం రాజమహేంద్రవరంలో జరిగిన శ్రమదానం కార్యక్రమం కొరకు, ఇలా అనేక సమస్యల పైన, జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు అనేక పోరాటాలు చేసి, కొత్తపేట నియోజకవర్గంలోని, నాలుగు మండలాల ప్రజలు మన్ననలు పొందారని తెలియజేశారు. అంతేకాకుండా మా జనసేనాని నేర్పిన సంస్కారం, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించవద్దని, సమస్యలపై అలుపెరుగని పోరాటం చేయాలని తెలియజేయడం, మా జనసేనాని పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం అని, పలువురు వక్తలు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంనకు రావులపాలెం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తోట స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ జనసేన నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజ్, జిల్లా కార్యదర్శి దొంగ వెంకట సుబ్బారావు, ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, ఆత్రేయపురం మండలం ఉపాధ్యక్షులు బండారు బాబి, ప్రముఖ జనసేన నాయకులు యర్రంశెట్టి రాము, జనపరెడ్డి తాతారావు, అంబటి కిషోర్, నంబు రవి, గాయత్రి ప్రసాద్, అంబటి మణికంఠ, గీత వెంకటేష్, గరికల తేజ, నాగిరెడ్డి మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.