గాయకులను ఆదుకోనే నేపధ్యంలో సంగీత విభావరి

కోవిడ్-19 కారణంగా జీవనోఫాది కొల్పోయిన గాయకులకు ఆర్థికంగా సాయాన్ని అందించడానికి కమల్‌ హాసన్‌, ఏ.ఆర్‌.రెహమాన్‌తో పాటు మరో 80 మంది గాయకులు కలిసి ఆన్‌లైన్‌ వేదికగా సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విరాళాల సేకరణ చేపట్టబోతున్నారు. దీనికి ‘ఓరు కురలయి’ అని పేరు పెట్టారు. ఫేస్‌బుక్‌లో సెప్టెంబరు 12న ఆరు గంటలకు ఇది లైవ్‌ స్ట్రీమ్‌ కాబోతుంది. ఈ కార్యక్రమం ఆరు గంటల పాటు జరగనుంది. గాయకుడు శ్రీనివాస్‌కు చెందిన యునైటెడ్‌ సింగర్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌(యుఎస్‌సీటీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జీవనోఫాదిని కొల్పోయిన గాయకులను ఆదుకోవడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఉన్ని కృష్ణన్‌, సుజతా మోహన్‌, రాహూల్‌ నంబియార్‌, రంజిత్‌ గోవింద్‌, హరిచరణ్‌, సైంధవి తదితరులు ఈ సంస్ధకు ట్రస్ట్రీలుగా ఉన్నారు. ఒక ఈవెంట్ మేనెజ్‌మెంట్‌ కంపెనీతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

హరిహరన్‌, శంకర్‌ మహదేవన్‌, శ్రేయా ఘోషల్‌తో పాటు ఇతర గాయకులు పాటలు పాడబోతున్నారు. కమల్‌ హాసన్‌, రెహమాన్‌ తప్పితే మిగతా అందరూ తమ అనుభవాలను కూడా పంచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉచితంగా వీక్షించొచ్చు. కార్యక్రమం జరిగే సమయంలో తెరపై కనిపించే సూచనలను అనుసరించి వీక్షకులు తమకు తోచిన సహాయం అందిచొచ్చు. అనంతరం ఆ సంస్థ ఇబ్బందుల్లో ఉన్న గాయకులకు సహాయాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని యుఎస్‌సీటీ ఫేస్‌బుక్‌ పేజీతో పాటు, అనిరుద్‌, జీవీ ప్రకాశ్‌ సామాజిక మాధ్యమాల్లోని ఆకౌంట్‌ల ద్వారా కూడా చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *