ఆత్మకూర్ నియోజకవర్గ జనసేన పార్టీ మెగా మెడికల్ క్యాంప్

ఆత్మకూర్ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, పవర్ ఆఫ్ యూత్ అధినేత శ్రీపతి రాము ముఖ్య అతిధిలుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు రవి ఉదయగిరి ఆధ్వర్యంలో, జిల్లా నాయకులు శ్రీనివాస్ భరత్ పర్యవేక్షణలో మెడికోవర్ హాస్పిటల్స్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ అనంత సాగరం మండలంలోని పడమటి కంభంపాడులో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులుకి సహకరించిన హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆర్.వి రమణ రెడ్డి, వల్లూరు శ్రీనివాస్ చౌదరి, నలిశెట్టి శ్రీధర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు నాగరాజు యాదవ్, చేజర్ల ఇంచార్జ్ అనిల్ రాయల్, ఆత్మకూర్ టౌన్ నాయకులు వేణుగోపాల్, వంశీ, సంగం మండల ప్రధాన కార్యదర్శి మదన్ యాదవ్, మర్రిపాడు మండల ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.