తిరువూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

తిరువూరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన జనసేన పార్టీ ని బలోపేతం చేయడమే మన లక్ష్యం.. రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మరియు మనబోలు శ్రీనివాసరావు

ఆదివారం రోజు తిరువూరు నియోజకవర్గం, తిరువూరు టౌన్ లో కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ సమక్షంలో జనసేన పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. తిరువూరు నియోజకవర్గంలో జనసేనపార్టీ సమావేశానికి 1000 మంది నాయకులు కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీ చేసి జనసేనపార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ప్రారంభించారు అనంతరం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో.. శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతం దిశగా పని చేయాలని, మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ప్రతి జనసైనికుడిని కలుపుకుని వెళ్తూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని, మండల కార్యవర్గాన్ని త్వరగా వెయ్యాలని మండల అధ్యక్షులను కోరడం జరిగింది.

రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ ఈ రోజు తిరువూరు నియోజకవర్గంలో ఇన్ ఛార్జ్ లేకుండా ఇంత భారీ సమావేశం పెట్టడం మాములు విషయం కాదు, జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తశుద్ధితో పార్టీకోసం పనిచేయ్యాలి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని మీరు అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకొని వెళ్లాలని అమ్మిశెట్టి వాసు అన్నారు.

కృష్ణాజిల్లా జనసేనపార్టీ కార్యదర్శి మనబోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రోజు సమావేశం విజయవంతం అయ్యింది అంటే.. తిరువూరు నియోజకవర్గ కార్యకర్తలు టీమ్ వర్క్ చేయడమే, నియోజకవర్గంలో ప్రతి మండలం లో వున్న గ్రామాలు అన్నీతిరిగి జనసేనపార్టీ సిద్ధాంతాలు కార్యకర్తలకు తెలియజేస్తూ పార్టీ బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశ్యం తో ముందుకు వెళ్లడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో తిరువూరు నుండి జనసేనపార్టీని గెలిపించే దిశగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పార్టీకోసం పని చేస్తాం అని మనబోలు శ్రీనివాస్ మాట్లాడారు.

జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి కొంత మంది యువకులు రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి మనబోలు శ్రీనివాసరావు మరియు జిల్లా టీం వారి సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిసా మురళీకృష్ణ, బండ్రిరెడ్డి రవి, జిల్లా కార్యదర్శి మనబోలు శ్రీనివాస్ చింతల లక్ష్మీ కుమారి, సంయుక్త కార్యదర్శి ఈమని కిశోర్ , స్వరూప, మరియు సోషల్ జస్టిస్ విభాగం అధ్యక్షులు అజయ్ వర్మ, తోట శ్రీనివాసరావు, రావి సౌజన్య, పవన్, పొలిశెట్టి తేజ, సుందరరామి రెడ్డి, నందిగామ రాజేష్, దాసరి కిరణ్, మండల అధ్యక్షులు మరియు భారీ ఎత్తున జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.