క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: బాలు యాదవ్

డోన్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పనిచేసే జనసైనికులకు వీరమహిళలకు భరోసా కల్పిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఈ నెల 21వ తేది ప్రారంభం కానున్న నేపథ్యంలో డోన్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు బాలు యాదవ్ అధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాలనే మంచి ఉద్దేశ్యంతో దేశంలో మొట్టమొదటి సారిగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డోన్, బేతంచెర్ల, ప్యాపిలీ మండలాల్లోని ప్రతి గ్రామంలో ఉన్న జనసేన కుటుంబ సభ్యులందరికీ క్రియాశీలక సభ్యత్వం చేసుకునేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని మండల నాయకులకు బాలు యాదవ్ పిలుపునిచ్చారు. జనసైనికులకు వీరమహిళలకు ఏదైనా జరగరానిది జరిగితే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు జీవిత భీమా కింద కేవలం సంవత్సరానికి 500 రూపాయలతో అక్షరాల 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేలా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకొచ్చారు.కావునా పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని బ్రహ్మం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డోన్ బ్రహ్మం, బేతంచెర్ల నుంచి పరమేష్ , నాగ మునీంద్ర, చరణ్ . ప్యాపిలి మండలం నుంచి మధు నాయుడు, సునీల్, చంద్ర, జగదీష్, మధుసుదన్ పాల్గొన్నారు.