గుండెగాం గ్రామ ప్రజలకు శాశ్వత పునరావాసం కల్పించాలి.. జనసేన వినతిపత్రం

నిర్మల్ జిల్లా, బైంసా మండలం, గుండెగం పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు వల్ల గత ఏడు సంవత్సరాలుగా బైంసా మండలంలోని గుండెగాం గ్రామ ప్రజలు వర్షాకాలం వరద ముంపునకు గురవుతూనే ఉన్నారు. వారికి నూతనంగా భైంసా-గుండెగం రహదారిలో నిర్మించిన డబల్ బెడ్రూంలో తాత్కాలిక పునరనివాసం కల్పించారు. డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న గ్రామస్తులు ఇండ్లలో కరెంటు వాటర్ లేకపోవడంతో గత 3 రోజులుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ తహసిల్దార్ కార్యాలయంలో ముందర బైటయించారు. రెండు రోజుల క్రితం కరెంటు లేక వండిన కూరలో బాలుడు పడ్డాడని గాయాలతో ఉన్న బాలుని తాసిల్దార్ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి పరిస్థితిని తాసిల్దార్ కు గ్రామస్తులు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సుంకెట మహేష్ బాధితులకు మద్దతు తెలిపారు. జనసేన నాయకుడు తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించి గుండెగాం గ్రామస్తుల సమస్య ఎన్ని రోజుల నుండి పరిష్కారం అయ్యేంతవరకు ఇక్కడి వెళ్లేది లేదని విస్మరించి కూర్చున్నారు తాసిల్దార్ పై అధికారులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు జనసేన పార్టీ నాయకులు శాంతించారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు సమస్య పరిష్కరించకపోతే మళ్లీ ధర్నా రాస్తారోకో నిరాహార దీక్ష చేస్తామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు.