ఎస్.రాయవరం జనసేన మండల స్థాయి ఆత్మీయ సమావేశం

ఎస్.రాయవరం, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా ఎస్.రాయవరం మండల చుట్టుప్రక్కల్ గ్రామాల వారందరూ పులి సత్తిబాబు అధ్వర్యంలో లీడర్స్ ఆఫ్ జనసేన పేరిట కమిటిలు వేసుకుని తద్వార గ్రామ కమిటిలకు ప్రణాళిక వేసుకునే దిశలో మండల స్థాయి ఆత్మీయ కలయిక పెట్టుకుని దానికి నన్ను కూడ ఒక ముఖ్య అతిధి గా ఆహ్వానించి సలహ సూచనలు తీసుకోవటం జరిగింది. భవిష్యత్ లో వీరి కార్యచరణ మరింత బలంగా పార్టీ పటిష్టతకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని నా అచంచలమైన విశ్వసం. ఇదే దిశగా మరింతగా క్రసీ చేసి మిగతా మండ్లాల వారు గ్రామాల వారు కూడ వారి వారి కమిటిలు వేసుకుని పార్టీ పటిష్టతకు పనిచేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యామంత్రిగా చేసే భాద్యత మనందరి పైనా వుందని ఇది మనందరి తక్షణ కర్తవ్యమని అలాగే ఆ దిశగా వెళ్ళే మనకు ఎన్నీ అవరోధాలు వచ్చిన చెక్కు చెదరకుండా ఆటంకాలకు బెదరకుండా నెగ్గే వరకు ఎక్కాడ తగ్గాలో తెలుసుకుని యువత కొన్ని చోట్ల వారి దుడుకుతనాన్ని తగ్గించుకుని గెలుపే లక్ష్యఒగా పోరాడదామని విశాఖ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ కరణం నూకరత్న కళావతి పిలుపునిచ్చారు. ఇది మరింత మందికి ఆదర్శప్రాయమైన రీతిలో నిర్వహించిన పులి సత్తిబాబు, నవీన్ , ధన, శివ తదితరులు సహకరించిన బాబురావు అండ్ టింలో ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఎంతో పని ఒత్తిడిలో ఉన్నప్పటికి ఆహ్వానించినందుకు కాదనకుండా వచ్చి తమ విలువైన సూచనలు సలహాలు ఇచ్చి యువతను ప్రోత్సాహించినందుకు కమిటి సభ్యలంతా కలసి లాయర్ కళావతి కి ఘన సన్మానం చేసి తమ అభిమానం చాటి చెప్పారు. ఆమెకు పార్టీ పై గల నిబద్దత, నిజాయితీ, చిత్తశుద్ది లను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పులి సత్తిబాబు పిలుపునిచ్చారు.