స్టాలిన్ కు జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరిన్ని వేడుకలు చేసుకోవాలని కోరుకొంటున్నాను. పాలన అంటే పథకాల పేర్లు మార్చడం కాదు… ప్రజాక్షేమం, అభివృద్ధి ప్రధానం అనే మీ ఆలోచన విధానం సర్వదా ప్రశంసనీయం. ఇదే రీతిలో మరిన్ని ఉత్తమ నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని జనసేనాని తెలిపారు.