ప్రధాని మోదీకి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు.

”ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భారతీయ విలువలు, ప్రజాస్వామ్య విధానం పట్ల మీ విధేయత ఆదర్శప్రాయం. మీరు ఎల్లపుడూ ఆరోగ్యంగా, అనందంగా ఉండాలని.. మీ అమూల్య సేవలు దేశానికి ఎల్లపుడూ లభించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని రాష్ట్రపతి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

‘భారత ప్రధాని శ్రీ నరేంద్ర భాయ్ మోదీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. వారి నాయకత్వంలో ఆత్మనిర్భరతతో కూడిన నవభారత నిర్మాణ స్వప్నం సాకారం దిశగా సాగుతుండటం ముదావహం. శ్రీ మోదీ గారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.